గౌరవనేయులిన చిరంజీవి గారికి మీకు గతం లో జయప్రకాశ్ నారాయణన్ గారు రూపొందించిన అవినీతి నిరోధక బిల్ ఆమోదించండి అని 50 రోజుల తేడ లో 3 సార్లు రక్త దానం చేయటం జరిగింది వాటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరొక సరి నేడు సెప్టెంబర్ 13 నా రక్తదానం చేస్తున్నాను to accept loksatta anti corruption bill
దయచేసి loksatta anti corruption bill ను ఆమోదింప జయవలిసింది గ కోరుతున్నాను
నా పేరు వేణు. ఒంగోలు నుండి వ్రాస్తున్నాను. మొదటిగా మిమ్మల్ని అభిమానిస్తూ, మిమ్మల్ని ఆదర్శంగా తెసుకుంటూ రక్తదానం, నేత్రదానం చేస్తూ, చేపిస్తూ ఉండే వందలాది మందిలో నేను ఒకరిని.
నేను మీకు గుర్తు ఉంది ఉండను. కొన్ని సంవస్తారలక్రితం చిరంజీవి రక్త నిధి కి మీరు వస్తున్నారని తెలిసి నేను వచ్చి రక్తం దానం చేశాను. అప్పుడు మీరు నన్ను అభినందిస్తుంటే నేను ఒకే ఒక కోరిక కోరను. మీలాంటివారురాజకీయాలలోకిరావాలి. లేకపోతెఒకరౌడీగుండానక్షలితె , టెర్రరిస్ట్రాజకీయాలలోకివచ్చిమనదేశాన్నిదోచుకుంటాడుఅనిఅన్నాను. అప్పుడు మీరు చిరునవ్వుతో నా బుజం తట్టి వెళ్ళిపోయారు. కారణాలు ఎమైన మీరు రాజకీయాలలోకి వచ్చారు. నా కోరిక తీర్చారు. నేను ఆ సంతోషం తట్టుకోలేక తిరుమల కు నడుచుకుంటూ వెళ్లి దేవునికి తలనీలాలు ఇచ్చాను.
అలాగే ప్రస్తుతం నేను నా రక్తదానం చేస్తున్నాను . ఇది నా జీవితం లో 21 వ రక్తదానం . మీరు ఈ చట్టాన్ని ఆమోదించే వరకు నేను రక్తదానం చేస్తుంటాను. (నీరసనగా ) నా చివరి రక్తదానాలు febravari 3 febravari 25 march 26
ఇప్పుడు నా కోరిక జయప్రకాశ్ నారాయణన్ గారు రూపొందించిన అవినీతి నిరోధక చట్టం. ఈ చట్టాన్ని మీరు నేను సైతం అవినీతి నిరోధక చట్టం అని లేక మెగాస్టార్ అవినీతి నిరోధక చట్టం అని ఏ పేరు తో ఐన ప్రవేసపెట్టండి. కానీ ఈ చట్టం అమలుకావాలి.
అవినీతి అంటే అక్రమంగా కోట్లు సంపాదించుకొని కుంభకోణాలు చేసిన తర్వాత విచారణ జరిపి వాదనలు ప్రతివాదనలు విని చర్యలను తేసుకోవటం కాదు. అలా జరిగాలకి కనీసం 10 సంవస్త్సరాలు అవుతుంది. (అందుకే ప్రతి రాజకీయ నాయకుడు పోతే కోటి వస్తే 100 కోట్లు మంత్రి ఐతే 1000 కోట్లు అని ప్రతి రౌడీ గుండా లు రాజకీయాలలోకి వస్తున్నాడు. ) కానీ అసలు అవినీతి చేయాలి అనే ఆలోచన వస్తేనే కళ్ళు చేతులు వనకాలి మరొకరు ఆ తప్పు చేయాలి అంటే భయపడాలి అలాంటిది ఈ చట్టం. ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు అవినీతి ని అంతం చేయటానికి వచాడు అని నేను మీకు ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. కానీ మీరు అవినీతి మీద పోరాడవద్దు పోరాడటానికి మేము ఉన్నాము మీరు చేయలిసింది చట్టం చేయటం ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయటం.
హామీలు ఇప్పటివరకు ప్రతి రాజకీయనాయకుడు కోట్లాది కోట్ల హామీలు ఇట్చారు అందులో లక్షల హామీలు కూడా నెరవేర్చలేదు. మీకు సోనియా గారు హామీ ఇట్చారు అవినీతి ని నిరోదిస్తానని హామీ ఇట్చారు. కానీ హామీల కన్నా చట్టాలు బాగా అమలు అవుతాయి అదే స్వయంప్రతిపత్తి కలిగిన చట్టాలు ఇంకా బాగా అమలు అవుతాయి (ఉదాహరణకు సమాచార హక్కు చట్టం ) కావున స్వయంప్రతిపత్తి కలిగిన జన లోక్పాల్ అవినీతి నిరోధక చట్టాన్ని అసంబ్లీ లో అమలు చేయవలిసింది గా కోర్తున్నాను . మీరు రాజకీయాలలోకి వచ్చింది అవినీతిని నిర్మూలించేందుకే ఈ చట్టం ఆమోదం చేయవలిసింది గా కోరుతున్నాను.
చాలా మంది మంచి వారు రాజకీయాలలోకి వస్తే అంత మంచే జరుగుతుంది అని అనుకుంటున్నారు . అల అంబేత్కర్ మిగత స్వతంత్ర పోరాట యోధులు కూడా అనుకున్నారు. కానీ అంత అనుకున్నట్లు మంచి వాళ్ళు రాజకీయాలలోకి వస్తే మంచి జరుగుతుందా? అంత మంచే జరిగితే అసలు మీరు రాజకీయాలలోకి వచేవారు కాదు. పొతే కోటి వస్తే 100 కోట్లు మంత్రి ఐతే 1000 కోట్లు అని ప్రతి రౌడీ గుండా లు రాజకీయాలలోకి వస్తున్నాడు. అందుకే జయప్రకాశ్ నారాయణన్ గారు రూపొందించిన ఈ అవినీరోధక చట్టాన్ని ఆమోదించావలిసిందిగా కోరుతున్నాను.
ఒకప్పుడు రాజకీయాలు ప్రజాసేవ చేయటానికి అత్యుత్తమ మార్గాలు కానీ ఇప్పుడు అవినీతిగా డబ్బు సంపాదించుటకు సులువైన మార్గాలు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు అవినీతి అని చెట్టుకి కొమ్మలు నరుకుతున్నారు కానీ ఆ చెట్టు మళ్ళి చిగురిస్తుంది. కానీ ప్రభుత్వాలు చేయలిసింది చెట్టు కొమ్మలు నరకటం కాదు వేళ్ళను త్వలగించటం అలా చేస్తే కొమ్మలు కూడా ఎండి పోతాయి
నేను ఆ దేవుకికి మళ్ళి మొక్కుకుంటున్నాను ఈ అవినీతి నిరోధక చట్టం అసంబ్లీ లో అమలుజేస్తే తిరుమలకు నడుచుకుంటూ వెళ్లి దేవునికి తలనీలాలు సమర్పిస్తాను. ఒకవేళ మీద్వార ఆమోదిమ్పజేస్తే కనీసం 1000 మంది చేత రక్తదానం చేపిస్తాను అని మొక్కుకుంటున్నాను.
గమనిక : ఇప్పుడు మీరు లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు అని అన్నట్లు ఉన్నది. మీరు తలచుకుంటే ఈ చట్టాన్ని అమలుజేయగలరు . భవిష్యత్ ఇలా ఉంటుందో తెలియదు. జగన్ మళ్ళి కాంగ్రెస్ లోకి వస్తే ఆ చట్టం ఆమోదించటం మీ తరం కాదు అందుకే ఈ చట్టాన్ని ఆమోదించవలసి౦దిగా కోరుతున్నాను.
పైగా హజారీ గారు చెప్పారు జన లోక్పాల్ చట్టం 60 % మాత్రమే అవినీతిని నిర్ములించాగలదు. అని కానీ ఈ చట్టం అమలు ఐతే కనీసం 90 % అవినీతిని నిర్ములించగలదు. పైగా ఈ చట్టం లో ప్రదానం గా జన లోక్పాల్ బిల్ లో ఉన్నా అన్ని అంశాలతో పటు ombudsman అనేది అదనంగా ఉంది కాబట్టి అవినీతిని 90 % అవినీతిని నిర్ములించాగలదు. కాబట్టే ఈ చట్టాన్ని ఆమోదిన్చ వలిసిందిగా కోరుతున్నాను.
నేను చిరంజీవి గారికి నేత్రదానం తో కూడా అడగటం జరిగింది దానికోసం క్లిక్ చేయండి
మీకు ఈ పోస్ట్ నచ్చితే చిరంజీవి గారికి ఉత్తరాల ద్వార ఈ loksatta అనినీతి చట్టాన్ని ఆమోదిమ్పచేయవలిసింది గ తెలియజేయండి. చిరంజీవి గారి అడ్రస్: KONIDALA CHIRANJEEVI (PRP) D.NO.8-2-293/A/303-N, PLOT NO 303N ROAD NO 25, JUBILEE HILLS, హైదరాబాద్ - 500033 కు ఉత్తరాలు ద్వార తెలియజేయవలిసిందిగా కోరుతున్నాను.